ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది (3/23), మహ్మద్ వసీమ్ (3/31) ధాటికి.. బంగ్లాదేశ్ 204 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఆది నుంచే వికెట్లను చేజార్చుకుంది. తన తొలి రెండు ఓవరల్లోనే అఫ్రిది.. తన్జిద్ హసన్ (0), శాంటో (4)ను పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత ముష్ఫికర్ (5)ను హారిష్ రవూఫ్ ఔట్ చేయడంతో టాస్ గెలిచిన బంగ్లా 23/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే లిటన్ దాస్ (45), మహ్మదుల్లా (56) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ పాక్ బౌలర్లు పుంజుకుని క్రమంగా వికెట్లు పడగొట్టారు. అయితే కెప్టెన్ షకిబ్ (43) కాసేపు నిలబడటంతో పాక్‌కు 205 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ నిర్దేశించగలిగింది.
ఈ మ్యాచ్‌లో షాహిన్ అఫ్రిది ఓ రికార్డు సాధించాడు. పాక్ తరఫున ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 17.28 ఏవరేజ్‌తో 32 వికెట్లు పడగొట్టాడు. అతడి కంటే ముందు వసీమ్ అక్రమ్ (55), వాహబ్ రియాజ్ (35), ఇమ్రాన్ ఖాన్ (34) ఉన్నారు.