థాయ్‌లాండ్ ఆఫర్‌.. ఇండియన్స్‌కు ఫ్రీ ఎంట్రీ

థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ మేరకు థాయ్‌లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు తైవాన్‌ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులపాటు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చు. ఈ ఏడాది నవంబరు 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుంది. థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్‌, క్రబి, ఫుకెట్‌, ఫిఫీ దీవులు పర్యాటకంగా చాలా ఫేమస్‌. అంతేగాక డిఫరెంట్‌ ఫుడ్స్‌, నైట్‌క్లబ్‌లు మరో ప్రత్యేకత. మరోవైపు శ్రీలంక కూడా ఇండియన్స్‌కు వీసా లేకుండానే తమ దేశ సందర్శనకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి శ్రీలంకలో ఈ సడలింపు అమలులో ఉంటుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం