340
స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశాడు. తన మూవీ ‘మార్క్ ఆంటోనీ’ హిందీ వెర్షన్ రిలీజ్ కోసం అధికారులు రూ.6.5 లక్షల లంచం తీసుకున్నారని తెలిపాడు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆఫీసులో తనకు ఈ చేదు అనుభవం ఎదురైందని, దీన్ని జీర్జించుకోలేకపోతున్నాని తన ఆవేదనను ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన సినిమా స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం రూ. 3.5 లక్షలు చెల్లించానని చెప్పాడు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాని పేర్కొన్నాడు. తనకు ఎదురైన ఈ సంఘటన ఇతర నిర్మాతలకు జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని వెల్లడించాడు.