libya
Home » Libya floods-నిద్రలోనే ఊరంతా కొట్టుకుపోయింది

Libya floods-నిద్రలోనే ఊరంతా కొట్టుకుపోయింది

by admin
0 comment

లిబియాలోని డెర్నా నగరంలో భారీ విషాధం చోటుచేసుకుంది. డెర్నా నది ఉప్పొంగి రెండు ఆనకట్టలు తెగిపోవడంతో ఈ నగరంలోని ప్రాంతాలన్నింటిని వరద ముంచెత్తింది. ప్రవాహానికి అడ్డుగా వచ్చిన వాళ్లెవరూ ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా నివసించేవారు. దాదాపు 20వేల మంది మృతి చెందారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళలో ఈ ప్రళయం జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ఎటు చూసినా మృతదేహాలే. ప్రతిఇంటిలో కనీసం ఒకరు మరణించారని అక్కడి అధికారులు చెబుతున్నారు. మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది. మృతులని సామూహికంగా సమాధి చేస్తున్నారు. ఉత్తరాఫ్రికాను డేనియల్‌ తుఫాన్‌ ఇప్పటికే పూర్తిగా తుడిచిపెట్టేసింది. పర్వతప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో డెర్నా నది పొంగిపొర్లింది.

మరోవైపు కల్నల్ గడాఫి అధికారాన్ని కూలదోయడంతో అంతర్యద్ధం నుంచి ఇప్పటికీ ఆ దేశం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అధికారం తమదంటే తమదని ఆధిపత్యం కోసం ఇప్పటకీ పోటీ పడుతున్నాయి. అయితే తాజాగా బద్దలైన రెండు డ్యామ్‌లను 1973, 1977లో యుగోస్లావ్‌ కంపెనీ నిర్మించింది. డెర్నాలోని డ్యామ్‌ 75 మీటర్ల ఎత్తుతో 18 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నిల్వ సామర్థ్యంతో ఉంది. ఇక రెండో డ్యామ్‌ అయిన మన్సోర్‌ ఎత్తు 45 మీటర్లు. దీనిలో 1.5 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు పడుతుంది. ఈ రెండింటిని 2002లో చివరిసారి మెయింటెనెన్స్‌ చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links