స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సగటున ప్రతి మూడు మ్యాచ్‌లకు ఓ రికార్డు బద్దలవుతుంటుంది. పరుగులు సాధించడమంలోనే కాకుండా ఫీల్డింగ్, జట్టు విజయాల్లో తన పేరు మీద ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే తన కెరీర్‌లో ఇలాంటి ఘనతలు అందుకుంటున్నానని ఎప్పుడూ ఊహించలేదని విరాట్ కోహ్లి తెలిపాడు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు.
”క్రికెట్‌లో ఇన్ని ఘనతలు సాధిస్తానని అసలు ఊహించలేదు. ఇలా జరగాలని ఎప్పుడూ కోరుకోలేదు. నా కెరీర్‌లో ఇన్ని పరుగులు, ఇన్ని సెంచరీలు చేస్తానని కూడా అనుకోలేదు. కానీ భగవంతుని ఆశీస్సులతో సాధ్యమైంది. నా దృష్టి అంతా జట్టు కోసం గొప్ప ప్రదర్శన చేయాలని, గెలిపించాలనే ఉంటుంది. దాని కోసం నా లైఫ్ స్టైల్ మార్చుకున్నా, క్రమశిక్షణ అలవరుచుకున్నా. ప్రస్తుతం ఆటలో ఎలా రాణించాలనే దానిపైనే నా ఫోకస్ ఉంది. దాని వల్ల ఫలితాలు వాటంతంటే అవే వస్తాయి. నా కెరీర్‌లో నేర్చుకున్నది ఇదే” అని కోహ్లి చెప్పాడు.