ISRO- చంద్రయాన్‌-3 క్విజ్‌.. ప్రైజ్‌మనీ రూ. లక్ష

ఇస్రో ‘చంద్రయాన్‌-3 మహా క్విజ్‌’ పోటీలను నిర్వహిస్తుంది. జులై 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణధ్రువంపై కాలుమోపి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ఉపగ్రహ పరిశోధనలపై భారతీయుల్లో అవగాహన కల్పించేందుకు ఈ పోటీలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 16 లక్షల మంది భారతీయులు ఇందులో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతి ఇస్తారు.

మొదటి స్థానంలో నిలిచినవారికి ప్రైజ్‌మనీ రూ. లక్ష ఇస్తారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచినవారికి రూ.75 వేలు, రూ.50 వేలు అందిస్తారు. అలాగే ఆ తర్వాత స్థానాల్లో ఉన్న 100 మందికి తలో రూ.2000, ఇస్తారు. తర్వాత ఉన్న మరో 200 మందికి తలో రూ.1000 ఇస్తారు. క్విజ్‌లో పాల్గొనడానికి https://isroquiz.mygov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం