TSPSC Group 1- మరోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ నిర్వహించండి: హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దును తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కమిషన్‌ అప్పీలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం బుధవారానికి తీర్పును వాయిదా వేసింది. వాదనల అనంతరం పరీక్ష రద్దు తీర్పు సబబేని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్‌-1 పరీక్ష ఇప్పటికీ రెండు సార్లు రద్దైంది.

తొలిసారిగా గతేడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్‌ నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తర్వాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా..నిర్వహణలో లోపాలు తలెత్తాయని పలువురు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని పేర్కొన్నారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..