మెగాస్టార్ చిరంజీవి దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ మూవీలో విలన్ రోల్ కోసం రానా దగ్గుబాటిని సంప్రదించారని సమాచారం. రానా హీరోగానే కాకుండా విలన్‌గా ఇప్పటికే పాన్ఇండియా స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఇక మెగాస్టార్ మూవీలో విలన్ పాత్ర అంటే రానా నో చెప్పే ఛాన్సే ఉండదని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఫాంటసీ అడ్వెంచర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కె.రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. అల్లు అరవింద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. చిరు, సురేఖ దంపతులు చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు.
273
previous post