ఐఫోన్ 13 రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లతో తక్కువ ధరకు వస్తుంది. ఈ మోడల్ ఫోన్ 2021లో భారత్‌లో విడుదలైంది. ఇది మార్కెట్‌లోకి రూ.79,900 ధరతో వచ్చింది. గతకొన్ని నెలలుగా ఈ ఫోన్ ధర తగ్గుతూ వస్తోంది. ఇటీవల ఐఫోన్ 15ను విడుదల చేసిన తర్వాత ఐఫోన్ 13 ధరను రూ.59,900కు తగ్గించింది. తాజా సేల్‌లో ఇది రూ.40 వేల కన్నా తక్కువ ధరకే వస్తుంది. అయితే ఇలా దక్కించుకోవాలంటే వివిధ ఆఫర్లను ఉపయోగించుకోవాలి. SBI బ్యాంక్ కార్డు ద్వారా కొంత రాయితీ లభిస్తుంది. అలాగే పాత స్మార్ట్ ఫోన్‌ను కూడా ఎక్స్ఛేంజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ఫోన్ తక్కువ ధరకు లభిస్తుంది.
అలాగే మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం1 తాజా సేల్‌లో రూ.69,990కి అందుబాటులో ఉంది. భారత్‌లో అత్యంత చౌకగా లభిస్తున్న సిలికాన్-పవర్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాక్‌బుక్‌లో 8 GB ర్యామ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటుులో ఉంది. యాపిల్ ఎం1 చిప్, 8-కోర్ సీపీయూ, 7-కోర్ జీపీయూ అందుబాటులో ఉన్నాయి.