భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం దాదాపు 94% నీటిలోనే ఉంది. మిగతా ప్రాంతమంతా చిన్న చిన్న దీవులతో న్యూజిలాండ్ మాదిరిలా ఉంది. విస్తీర్ణంలో ఇది మడగాస్కర్‌కు ఆరు రెట్లు ఉంటుంది. ఆక్లాండ్‌లో ఉన్న న్యూజిలాండ్ క్రౌన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ జీఎన్‌ఎస్ సైన్స్ పరిశోధకులు కొత్త ఖండం మ్యాప్‌ను విడుదల చేశారు. దీనికి ‘జిలాండియా’ అని పేరు పెట్టారు. 1642లోనే దీన్ని గుర్తించినప్పటికీ ఆధారాల కోసం 375 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అక్కడ లభ్యమైన రాళ్లు, అవక్షేప నమూనాలపై పరీక్షలు చేసి కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గోండ్వానాలో భాగమైన జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.
249
previous post