గాయంతో ప్రపంచకప్‌నకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్పందించాడు. మెగాటోర్నీకి దూరమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని అన్నాడు. ”ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్‌కు స్ఫూర్తినిస్తూ, ఉత్సాహపరుస్తూ జట్టుతోనే ఉంటా. త్వరగా కోలుకోవాలని నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. ఈ జట్టు ఎంతో స్పెషల్. ప్రతిఒక్కరిని గర్వపడేలా కచ్చితంగా చేస్తుందని నమ్ముతున్నా” అని హార్దిక్ సోషల్‌మీడియాలో ఎమోషన్ పోస్ట్ పెట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే. బంతిని ఆపే ప్రయత్నంలో పట్టుతప్పి ఎడమకాలిపై పడిపోయాడు. అయితే హార్దిక్ స్థానంలో యువ పేసర్ ప్రసిధ్ కృష్ణ టీమిండియాలోకి వచ్చాడు.