KGF నటి ఆధార్‌తో కేటుగాళ్లు సిమ్‌- నటి, పోలీసులు షాక్‌!

కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్‌ను సైబర్‌ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్‌ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్‌ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్‌కార్డుతో ముంబయిలోని రిచ్‌ పర్సన్స్‌కు కాల్స్‌, మెసేజ్‌లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో నిజాలు తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. ఆ సిమ్‌ కార్డు మాళవిక పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. జరిగిన వంచనపై సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేయాలని ఆమెకి పోలీసులు సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా మాళవిక తెలిపారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం, నటనతో మాళవిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక కేజీయఫ్‌తో కన్నడ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం