రామ్ చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు సమాచారం. కియారా అడ్వాణీ హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కథ అందించాడు. అయితే గేమ్ ఛేంజర్ కథను ఏ పరిస్థితుల్లో డైరెక్టర్ శంకర్‌కు ఇచ్చాడో కార్తీక్ సుబ్బరాజ్ వివరించాడు. తన కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా పొలిటికల్ కథ రాశానని, అది తన అసిస్టెంట్లకు చెబితే.. శంకర్ సినిమాలా పెద్ద స్థాయిలో ఉందని చెప్పారని కార్తీక్ తెలిపాడు. అంత పెద్దస్థాయి పొలిటికల్ మూవీ తీసే రేంజికి తాను రాలేదని, అందుకే ఈ కథను శంకర్‌కు ఇచ్చానని చెప్పాడు. స్క్రీన్ ప్లే అంతా శంకరే చేసుకున్నాడని అన్నాడు.
250
previous post