377
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకున్నాడు. గతంలో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా తరఫున ఆడిన గంభీర్… 2012, 2014 సీజనల్లో జట్టును విజేతగా నిలిపాడు. ఇప్పుడు మళ్లీ అదే జట్టుతో చేరడంపై ఎంతో ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నానని గంభీర్ అన్నాడు. మరోవైపు లక్నో జట్టుతో ప్రయాణం అద్భుతంగా సాగిందని, లక్నో టీమ్ ఫ్యామిలీకి థ్యాంక్స్ అని చెప్పాడు. గంభీర్ లక్నో టీమ్‌కు మెంటార్‌గా ఉన్నప్పుడు.. ఆ జట్టు 2022లో రన్నరప్‌గా, గత సీజన్‌లో మూడో స్థానంలో నిలిచింది.