నటి జయప్రదకు ఆర్నెల్ల జైలు శిక్ష

సీనియర్‌ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada)కు చెన్నై ఎగ్మోర్‌ న్యాయస్థానం షాక్‌ ఇచ్చింది. రూ.5వేల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. ఆమె సినిమా థియేటర్‌లో పనిచేసిన కార్మికులకు ESI చెల్లించని కారణంతో ఎగ్మోర్‌ కోర్టు సీనియర్‌ నటికి శిక్ష విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి ఇదే శిక్ష ఖరారు చేసింది.

చెన్నైలోని రాయపేటలో ఓ సినిమా థియేటర్‌ను గతంలో జయప్రద నిర్వహించారు. చెన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి థియేటర్‌ పనులు చూసుకునేవారు. తొలుత మంచి లాభాలు వచ్చినా, తర్వాత రాబడి తగ్గడంతో థియేటర్ మూసేశారు. అయితే ఆ సమయంలో కార్మికుల నుంచి ఈఎస్ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. కానీ థియేటర్ మూసివేయడంతో కార్మికులకు తిరిగి డబ్బులు చెల్లించలేదు. దీంతో కార్మికులందరూ బీమా కార్పొరేషన్‌ను ఆశ్రయించగా, బీమా సంస్థ చెన్నై ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించింది. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. విచారణ అనంతరం ఎగ్నోర్‌ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం