Chandrayaan-3కు పోటీగా రష్యా Luna 25

జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు రష్యా నుంచి పోటీ ఎదురుకానుంది. దాదాపు 47 ఏళ్ల తర్వాత చంద్రుడిపై రష్యా శుక్రవారం ప్రయోగం చేపట్టింది. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా-25’ (Luna 25) రాకెట్‌ను ఆ దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్కోస్‌ ప్రయోగించింది. మాస్కోకు తూర్పున 3450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రమ్‌ ప్రాంతం నుంచి వేకువజామున 2.10 గంటలకు రాకెట్‌ను నింగిలోకి పంపింది. మరో వారం రోజుల్లోపే ల్యాండర్‌ను దిగేలా ప్రయోగం ప్రారంభించింది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 21వ తేదీలోపే లునా-25 దక్షిణ ధ్రువానికి చేరుకుంటుంది.

మరోవైపు ఇస్రో గత నెలలో జాబిల్లిపై చంద్రయాన్‌-3 (Chandrayaan-3) రాకెట్‌ను నింగిలోకి పంపించిన విషయం తెలిసిందే. అయితే చంద్రయాన్‌-3 ఆగస్టు 23న ల్యాండింగ్‌ కానుంది. దీంతో భారత్ కంటే ముందే రష్యా చరిత్ర సృష్టించేలా ఉంది. కాగా, చంద్రయాన్‌-3 మాదిరి కాకుండా లునా-25 కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. 1976 తర్వాత రష్యా చేపట్టిన తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇదే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం