కేజీయఫ్ నటి మాళవిక అవినాశ్‌ను సైబర్ నేరగాళ్లు వంచించారు. ఏకంగా ఆమె ఆధార్ కార్డును వినియోగించుకుని నిందితులు ఒక సిమ్ కార్డును కొనుగోలు చేశారు. ఆ సిమ్‌కార్డుతో ముంబయిలోని రిచ్ పర్సన్స్‌కు కాల్స్, మెసేజ్‌లు పంపించి వంచనలకు పాల్పడ్డారు. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. విచారణలో నిజాలు తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. ఆ సిమ్ కార్డు మాళవిక పేరిట ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. జరిగిన వంచనపై సైబర్ పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేయాలని ఆమెకి పోలీసులు సూచించారు. ఈ విషయాన్ని స్వయంగా మాళవిక తెలిపారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన అందం, నటనతో మాళవిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక కేజీయఫ్‌తో కన్నడ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.