379
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లిపై అడుగుపెట్టేందుకు భారత వ్యోమనౌక మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, అలాగే ఈ నెల 17వ తేదీన ల్యాండర్ విక్రమ్ తీసిన ల్యాండింగ్ సైట్ విజువల్స్ ను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
తాజా విన్యాసంతో ల్యాండర్ మాడ్యూల్ తన కక్ష్యను 113 km x 157 km తగ్గించుకుంది. రెంబో బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న తెల్లవారుజామున 2 గంటలకు చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. రెండో విన్యాసం తర్వాత ల్యాండర్ మాడ్యూల్ జాబిల్లి ఉపరితలానికి మరింత చేరువ కానుంది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగనుంది.