అక్కడ ఏ వస్తువైనా రూపాయే! ల్యాప్‌టాప్‌తో సహా..

అక్కడ ఏ వస్తువైనా సరే కేవలం రూపాయే. ఎసర్‌ ల్యాప్‌టాప్‌, హామ్లే బొమ్మలు, బ్రాండెడ్‌ దుస్తులు, ఇటాలియన్‌ క్రాకరీ సెట్‌, గ్రైండరు… ఇలా ఏ వస్తువు అయినా సరే అక్కడ రూపాయికే దొరుకుతాయి. ఇంతకీ అది ఎక్కడనుకుంటున్నారా? చండీగఢ్‌లోని RRR షాప్స్‌లో. మన ఎన్టీఆర్‌-రామ్‌చరణ్ నటించిన ఫేమస్‌ మూవీ నేమ్‌తోనే ఈ షాప్స్‌ ఉంటాయి. అయితే RRR అంటే.. రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌. పనికిరాని వస్తువుల్ని మనం బయట పడేస్తుంటాం. కానీ అలాంటి వస్తువుల్ని అవసరం ఉన్నవారికి అందించాలని చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఓ ఆలోచన చేసింది. నగరవ్యాప్తంగా దాదాపు 40 షాప్స్‌ తెరిచి- వాడని వస్తువులను తమకి ఇస్తే వాటిని రీసైకిల్‌ లేదా రిపైర్‌ చేసి కొత్తవాటిలా మార్చేసి పేదలకు రూపాయికే ఇస్తామని ప్రకటించింది. అలాంటి వస్తువుల్ని సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్‌లు కూడా చేపడుతోంది. వాటిని కొత్తగా మార్చి పేదలకూ, వలస కార్మికులకూ, విద్యార్థులకూ అందజేస్తున్నారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం