374
నటి అనసూయ సంచలన కామెంట్స్ చేసింది. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు తాను దూరంగా ఉంటున్న కారణంగానే హీరోయిన్ అవకాశాలు కోల్పోతున్నాని చెప్పింది. ”షూటింగ్స్‌లో నా పని నేను చూసుకుని వెళ్తుంటాను. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు చాలా దూరంగా ఉంటా. ఈ కారణంగానే హీరోయిన్ అవకాశాలను కూడా కోల్పోయాను. అలా పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయంటే వాటిని ప్రోత్సహించను” అని అనసూయ తెలిపింది. అలాగే ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని సాంగ్‌లో నటించకపోవడానికి గల కారణాన్ని ఆమె వివరించింది. అందులో చాలా మంది హీరోయాన్స్ ఉన్నారని చేయలేదని తెలిపింది. గుంపులో ఒకరిగా నటించడం తనకి నచ్చదని.. అందుకే పవర్‌స్టార్ సాంగ్‌లో నటించలేదని తెలిపింది. అయితే అలా కఠినంగా చెప్పినందుకు త్రివిక్రమ్‌కు సారీ చెప్పానని పేర్కొంది.