నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వరుస హిట్లతో వంద కోట్ల గ్రాస్ మార్క్ సాధించాడు. అదే జోష్‌తో బాలయ్య.. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్‌ను ఓకే చేసిన సంగతి తెలిసిందే. అయితే పోస్టర్‌తోనే ఆకట్టుకున్న చిత్రయూనిట్ తాజాగా కొత్త అప్‌డేట్‌ను పంచుకుంది. ‘బ్లడ్ బాత్‌కు బ్రాండ్ నేమ్.. వయలెన్స్‌కు విస్టింగ్ కార్డ్’ అనే క్యాప్షన్‌తో ఓ ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేసింది. పదునైన గొడ్డలి, దానిపై ఉన్న కళ్లజోడులో ఉగ్ర నరసింహస్వామి కనిపిస్తోన్న ఆ పోస్టర్ చూస్తుంటే బాలయ్య-బాబీ.. భారీ స్థాయిలో ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమా #NBK అని పేరుతో ప్రచారంలో ఉంది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు.
471
previous post