గౌతమ్ మేనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్.. ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఆరేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. 2016లోనే పట్టాలెక్కిన ధృవ నక్షత్రం 2017లో విడుదల చేయాలని భావించారు. కానీ ఆర్థిక ఇబ్బందులతో సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా శుక్రవారం విడుదల చేయాలని ప్లాన్ చేయగా.. మద్రాసు హైకోర్టు నిబంధన విధించింది. శింబు హీరోగా గౌతమ్ మేనన్.. ‘సూపర్ స్టార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బు తీసుకున్నారని, కానీ సినిమాని పూర్తి చేయలేదని.. అలాగే డబ్బు తిరిగి ఇవ్వలేదని ‘ఆల్ ఇన్ పిక్చర్స్’ హైకోర్టులో పిటిషన్ వేసింది. డబ్బు తిరిగి చెల్లించేవరకూ ‘ధృవ నక్షత్రం’ విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరింది. దాంతో న్యాయస్థానం సినిమా విడుదలకు షరతు విధించింది.
259
previous post