AsianGames2023 – యువీ రికార్డు బద్దలైంది.. Nepal సంచలన రికార్డులు

పసికూన జట్టు నేపాల్‌ క్రికెట్‌ చరిత్రలో నమ్మలేని రికార్డులు సృష్టించింది. ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన రికార్డులు సాధించింది. 20 ఓవర్లలో ఏకంగా 314 పరుగులు సాధించింది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 300కిపైగా పరుగులు చేసిన ఏకైక జట్టుగానూ నిలిచింది. అంతేగాక మంగోలియాను 41 పరుగులకే ఆలౌట్‌ చేసి 273 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

ఇక నేపాల్‌ బ్యాటర్‌ దీపేంద్ర సింగ్‌ 10 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాదాడు. దీంతో 12 బంతుల్లో ఇంగ్లాండ్‌పై యువరాజ్‌ సింగ్‌ సాధించిన వేగవంతమైన అర్ధ శతకం రికార్డును బద్దలుకొట్టాడు. అంతేగాక ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాడు. మరో బ్యాటర్‌ కుశాల్‌ మల్లా అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 34 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డు మిల్లర్‌ (35 బంతుల్లో) పేరిట ఉంది. కాగా, కుశాల్‌ 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం