415
యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. అయితే తాజాగా తన మేనేజర్ శ్రీను గుండెపోటుతో మరణించినట్లు ఝూన్సీ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన గుండె బద్దలైందని బాధ వ్యక్తపరిచారు. ‘నేనెంతో చనువుగా శ్రీను బాబు అని పిలిచేదాన్ని. నాకున్న సపోర్ట్ సిస్టమ్. హెయిర్ స్టైలిష్ట్‌గా నా దగ్గర ఉద్యోగంలో జాయిన్ అయి.. నా పర్సనల్ సెక్రటరీగా మారాడు. నా వృత్తికి సంబంధించిన ప్రతి పనిని ఎంతో సమర్థంగా నిర్వహించేవాడు. అతడు ఉంటే నాకెంతో ఉపశమనం. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. నా కుటుంబసభ్యుడిలా కలిసిపోయాడు. నా తమ్ముడితో సమానం. 35 సంవత్సరాల వయసులోనే అతడు గుండెపోటుతో లోకాన్ని విడిచిపెట్టడం నేను తట్టుకోలేకపోతున్నాను. నా గుండె బద్దలైంది. జీవితం నీటిబుడగ లాంటిది’ అని పోస్ట్ చేశారు.