100 కోట్ల బడ్జెట్‌తో అఖిల్ కొత్త మూవీ!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అఖిల్ అక్కినేని కొత్త మూవీపై ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఆ మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌ తో రూపొందనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనిల్‌ కుమార్‌ అనే ఓ కొత్త డైరెక్టర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. అనిల్‌కుమార్‌ ‘సాహో’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఈ కొత్త సినిమాకి ‘ధీర’ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. యువీ క్రియేషన్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఫాంటసీ కథతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇక అఖిల్‌ రీసెంట్‌గా నటించిన ‘ఏజెంట్‌’ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో వచ్చిన ఏజెంట్‌ ప్రేక్ష‌కులను ఆకట్టుకోలేకపోయింది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం