Aditya-L1: రేపే ఆదిత్య-ఎల్‌1 ప్రయోగం

ఇస్రో (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయ్యింది. చంద్రయాన్‌-3 విజయం అనంతరం అదే ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్‌1 (Aditya-L1)ను సిద్ధం చేసింది. షార్‌లో ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 23 గంటలకు పైగా ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌ 1 ఉపగ్రహాన్ని మోసుకుని PSLV-C57 నింగిలోకి దూసుకెళ్లనుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపడుతున్న తొలి మిషన్‌ ఇది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఆదిత్య-ఎల్‌1 శాటిలైట్‌ బరువు 1500 కిలోలు. భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కి.మీ. దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. తద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు లభిస్తుంది. కాగా, ఆదిత్య-ఎల్‌ 1 మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. సూర్యుని నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనువుగా ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం