aditya
Home » Aditya L1- డేటా సేకరణ షురూ.. సూర్యుడి దిశగా పయనం

Aditya L1- డేటా సేకరణ షురూ.. సూర్యుడి దిశగా పయనం

by admin
0 comment

సూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్‌1’ (Aditya L1) సైంటిఫిక్‌ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్‌, ఎనర్జిటిక్‌ అయాన్స్‌, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి చుట్టూ ఉన్న పార్టికల్స్‌ ప్రవర్తనను విశ్లేషించడానికి ఉపయోగపడుతుంది. వాతావరణం మారే కొద్దీ శక్తి కణాల ప్రవర్తనలో మార్పులు ఉంటున్నట్లు ఆదిత్య ఎల్‌1లోని స్టెప్స్‌ గుర్తించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

మరోవైపు ఆదిత్య ఎల్‌1 మిషన్‌ రేపు కీలక దశకు చేరుకుంటుంది. భూప్రదక్షిణ దశ ముగియనుంది. రేపు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సూర్యుడి దిశగా ప్రయాణం ప్రారంభించనుంది. ఈ క్రమంలో ఇది సన్‌-ఎర్త్‌ లగ్రాంజ్‌ 1కు చేరుకుంటుంది. ఇది భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్‌లో సూర్యుడు, భూమి గురత్వాకర్షణ శక్తులను ఉపయోగించుకొని ఏదైనా స్థిరంగా ఉండవచ్చు. ఇప్పటి వరకు ఐదు లగ్రాంజ్‌ పాయింట్లను గుర్తించారు. ఆదిత్య ఎల్‌1 తొలి లగ్రాంజ్‌ పాయింట్‌కు వెళ్తోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links