karthika
Home » Karthika- గుట్టుగా ముద్దుగుమ్మ నిశ్చితార్థం

Karthika- గుట్టుగా ముద్దుగుమ్మ నిశ్చితార్థం

by admin
0 comment

అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక. ఆమె చేతికి తొడిగిన ఎంగేజ్ మెంట్ రింగ్ కనిపించేలా ఫొటో దిగి, ఆ స్టిల్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.

కార్తీక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తాజా సమాచారం ప్రకారం, ముంబయికి చెందిన బిజినెస్ సర్కిల్ లోనే కార్తీకకు సంబంధం చూసినట్టు తెలుస్తోంది. కార్తీక తండ్రి పెద్ద వ్యాపారవేత్త. ముంబయిలో అతడికి చాలా వ్యాపారాలున్నాయి. వాటిలో కొన్నింటిని కార్తీక కూడా చూసుకుంటోంది. మరీ ముఖ్యంగా ఇంటీరియర్ బిజినెస్ లో కార్తీక చురుగ్గా ఉంది.

ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి ఆమె దగ్గరైనట్టు తెలుస్తోంది. అతడికి కూడా బిజినెస్ నేపథ్యం ఉన్న కుటుంబమే కావడం, తెలిసిన వ్యక్తి కూడా కావడంతో.. రాధ ఈ పెళ్లికి అంగీకరించినట్టు తెలుస్తోంది. కార్తీక పెళ్లి కబురును అధికారికంగా వెల్లడిస్తారా.. లేక పెళ్లి తంతు కూడా పూర్తయిన తర్వాత అప్పుడు ప్రకటిస్తారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకుంటే, రాధతో పాటు ఆమె కుటుంబం మొత్తం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటోంది.

ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగింది రాధ. ఆ తర్వాత తన వారసత్వాన్ని పెద్ద కూతురు కార్తీకకు అందించాలనుకుంది. అనుకున్నట్టుగానే టాలీవుడ్ లో తన పరిచయాలు ఉపయోగించి, నాగార్జున కొడుకు నాగచైతన్య సరసన సెట్ చేసింది. అలా నాగచైతన్య-కార్తీక కలిసి ఒకేసారి, ఒకే సినిమాతో పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఫ్లాప్ అయింది. నాగచైతన్య హీరో కాబట్టి, అక్కినేని బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి, ఎలాగోలా నెట్టుకొచ్చాడు. కానీ కార్తీక మాత్రం నెట్టుకురాలేకపోయింది. తెలుగులో మరికొన్ని సినిమాలు చేసినప్పటికీ అవేవీ ఆమెకు కలిసిరాలేదు.

యాక్టింగ్ టాలెంట్, అందం రెండూ ఉన్నప్పటికీ.. ఓవర్ హైట్ ఆమెకు పెద్ద ఇబ్బందిగా మారింది. చాలామంది హీరోలు ఆమెను రిజెక్ట్ చేశారు. అయినప్పటికీ తమిళ్ లో ప్రయత్నించింది. రంగం లాంటి మంచి సక్సెస్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ఆమెకు ఛాన్సులు రాలేదు. అట్నుంచి అటు కేరళ వెళ్లింది. అక్కడ కూడా కొన్ని సినిమాలు చేసింది. అవి కూడా కలిసిరాలేదు. దీంతో తండ్రి చేస్తున్న బిజినెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా సినిమాలు వదిలేసి, ఫ్యామిలీ బిజినెస్ కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు అదే రూట్లో తన కాబోయే భర్తను కూడా ఆమె సెలక్ట్ చేసుకున్నట్టుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links