Jailer- జైలర్‌ విలన్‌ అరెస్టు

రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో విలన్‌గా నటించిన ‘వినాయకన్‌’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అయితే మద్యం మత్తులో ఆయన పోలీసు స్టేషన్‌లోనూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వినాయకన్‌ అరెస్టు అవ్వడం ఇదేమి తొలిసారి కాదని తమిళ, మలయాళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఓ మోడల్‌ను వేధించిన కారణంగా వినాయకన్‌ను గతంలో కూడా అరెస్టు చేశారని, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారనే కథనాలు వచ్చాయి. వినాయకన్‌.. నందమూరి కల్యాణ్‌ రామ్‌ ‘అసాధ్యుడు’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం