659
విశాఖపట్నంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రామాటాకీస్ వైపు నుంచి సిరిపురం వైపు వెళ్తున్న ఈ కారు వి.ఐ.పి. రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో పార్కింగ్ చేసి వాహనాలను ఢీకొట్టింది. సుమారు ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొని డివైడర్ ఫుట్‌పాత్ ఎక్కేసింది. ఆ తర్వాత అక్కడున్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారు, ద్విచక్ర వాహనాలు బాగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్నది ఓ మహిళ అని, ఆమె వైద్యురాలని, మద్యం మత్తులో ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత మరో కారులో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.