bluemoon
Home » SuperBlueMoon-ఆకాశంలో ‘సూపర్‌ బ్లూ మూన్‌’ కనువిందు

SuperBlueMoon-ఆకాశంలో ‘సూపర్‌ బ్లూ మూన్‌’ కనువిందు

by admin
0 comment

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. ప్రతిసారి పౌర్ణమి రోజు కనిపించేలా జాబిల్లి ఈ సారి లేదు. చందమామ మనకు ఎంతో దగ్గరగా, పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇచ్చాడు. భూమికి సుమారు నాలుగు లక్షల కి.మీ దూరంలో ఉండే చంద్రుడు ఇలా పెద్దగా, సాధారణం కంటే మరింత ప్రకాశవంతంగా కనిపించడాన్నే సూపర్‌ మూన్‌ అని పిలుస్తారు. అయితే ఒకే నెలలో రెండు సార్లు నిండుచంద్రుడిగా కనిపించే ‘సూపర్‌ బ్లూ మూన్‌’ కూడా ఈ సారి చోటుచేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సమయాలకు అనుగుణంగా నిన్న, ఇవాళ ఉదయం చందమామ అలరించింది.

బుధవారం దేశంలోని పలు ప్రాంతాల్లో ‘బ్లూ మూన్‌’ కనువిందు చేసింది. దీన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించారు. ఈసారి చంద్రుడికి తోడుగా శనిగ్రహం కూడా కనిపించడం విశేషం. చందమామకు ఐదు డిగ్రీల ఎత్తులో ఓ ప్రకాశవంతమైన బిందువుగా శని గ్రహం కనిపించనుంది. దేశంలో ఈ బ్లూమూన్‌ నిన్న రాత్రి 9.30గంటల ప్రాంతంలో ప్రకాశవంతంగా కనిపించింది, ఇక సూపర్‌ బ్లూ మూన్‌ మాత్రం ఈ రోజు ఉదయం 7గంటల ప్రాంతంలో గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

సాధారణంగా చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ‘సూపర్‌మూన్‌’గా పరిగణిస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణం కన్నా 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు దీన్ని పెరీజియన్‌ పౌర్ణమిగా పిలుస్తారు. ఒకే నెలలో రెండుసార్లు నిండు పౌర్ణమి ఏర్పడటాన్ని సూపర్‌ బ్లూ మూన్‌ లేదా బ్లూ మూన్‌ పేర్కొంటారు. అంతేకానీ పేరులో చెప్పినట్లు రంగు మాత్రం నీలంగా ఉండదు. చివరిసారిగా 2018లో ఇలా ఒకేనెలలో రెండుసార్లు జాబిల్లి కనిపించగా.. తిరిగి 2037లో ఇలాంటి అద్భుతం జరగనుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links