288
టెట్ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె భర్త, తన ఇద్దరు పిల్లలతో కలిసి పరీక్ష కేంద్రానికి వెళ్లారు. పరీక్ష ప్రారంభ సమయం దగ్గర పడటంతో, వేగంగా పరీక్ష కేంద్రంలోని గదికి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో వేగంగా వెళ్లడంతో బీపీ ఎక్కువై చెమటలు బాగా పట్టి పరీక్ష నిర్వహించే గదిలోనే రాధిక పడిపోయింది. వెంటనే రాధికను పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వచ్చి ఆమె చనిపోయి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు.