Summer Heat – తెలుగు రాష్ట్రాల్లో హీట్ అప్ డేట్

AP telangana weather

పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడిగాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, మెదక్‌, నిజామాబాద్‌, రామగుండంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్టు చెప్పింది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, నల్లగొండలో 42, మెదక్‌ 41, నిజామాబాద్‌లో 40.8, రామగుండంలో 40.6, హనుమకొండలో 39.5, హైదరాబాద్‌ 38.7, భద్రాచలంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం