వన్డే వరల్ట్ కప్‌లో ఆఖరి వరకు పోరాడి ట్రోఫీని చేజార్చుకున్న టీమిండియాకు దేశమంతా మద్దతుగా నిలుస్తుంది. ఛాంపియన్స్‌లా ఆడారని, గొప్పగా ఫైట్ చేశారని, సగర్వంగా తల ఎత్తుకోవాలని ప్లేయర్లకు అందరూ ధైర్యం చెబుతున్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రధాని మోడీ.. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి భారత ఆటగాళ్లను ఓదార్చారు. రోహిత్, కోహ్లి భుజాన్ని తట్టి, షమిని హత్తుకొని, ప్లేయర్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి.. స్ఫూర్తి మాటలతో ఊరడించారు. ”ఈ మెగాటోర్నీలో పది మ్యాచ్‌లు గెలిచారు. సగర్వంగా తల ఎత్తుకోండి. గర్వపడేలా పోరాడారు” అని మోడీ మాట్లాడారు. దిల్లీలో పార్టీ చేసుకుందామని, ఆటగాళ్లందరూ తప్పక రావాలని కోరారు. కాగా, టీమిండియాను ఉత్తేజపరిచేలా మోడీ బ్లూ కలర్ డ్రెస్‌తోనే స్టేడియానికి వెళ్లారు. మన జెర్సీకి తగ్గట్టుగానే ‘మెన్ ఇన్ బ్లూ’లో వెళ్లడం విశేషం.
255
previous post