సింగపూర్ నుంచి బెంగళూరుకు రావాల్సిన 6E 1006 విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానంలోని లగేజీని దించకపోవడం దీనికి కారణం. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ టేకాఫ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి చాంగీ ఎయిర్‌పోర్ట్‌కే వచ్చేసింది. అంతకుముందు.. తమ బ్యాగులు, లగేజీ రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దాంతో సమస్యను గుర్తించిన ఎయిర్‌లైన్స్ అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించారు. ఈ నేపథ్యంలో కొన్ని గంటల ఆలస్యంగా ఆ విమానం మళ్లీ అక్కడి నుంచి బయలుదేరింది. దీంతో బెంగళూరుకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘లగేజ్ మేనేజ్‌మెంట్‌లో లోపాన్ని గుర్తించాం. వెంటనే విమానాన్ని వెనక్కి రప్పించాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది.
1.5K