వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబరు 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడనున్నాయి. దాయాది దేశాల మధ్య పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ట్రాన్స్పోర్ట్కు కూడా ధరలు అమాంతం పెరిగాయి. విమానాలే కాదు టికెట్ ధరలు కూడా ఆకాశాన్నంటుతునున్నాయని అభిమానులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే ఓ శుభవార్త చెప్పింది. మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. త్వరలోనే ఈ రైళ్ల షెడ్యూల్, టికెట్ ధరల వివరాలు వెల్లడిస్తామని చెప్పింది.
కాగా, పాకిస్థాన్ ఉప్పల్ వేదికగానే నెదర్లాండ్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో పాక్ టాప్ ఆర్డర్ విఫలమైంది. ఫకర్ జమాన్ (12), ఇమామ్ ఉల్ హక్ (15), బాబర్ అజామ్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మరోవైపు ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఆదివారం చెన్నైలో ఈ మ్యాచ్ జరగనుంది.