indvpak
Home » INDvPAK: ప్రపంచకప్‌ షెడ్యూల్‌: 9 మ్యాచ్‌లు మారాయి

INDvPAK: ప్రపంచకప్‌ షెడ్యూల్‌: 9 మ్యాచ్‌లు మారాయి

by admin
0 comment

భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ మారింది. 9 మ్యాచ్‌లు జరగాల్సిన తేదీల్లో మార్పులు జరిగాయి. క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఒక రోజు ముందుకు జరిగింది. అక్టోబర్‌ 15న జరగాల్సి ఉండగా అక్టోబర్‌ 14న మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరగనున్న టీమిండియా మ్యాచ్‌ను నవంబర్‌ 12కు బదులుగా 11న నిర్వహించనున్నారు.

పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్లకు సంబంధించిన మూడు మ్యాచ్‌లను కూడా రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. కాగా, ఈ నెల 25 నుంచి వన్డే ప్రపంచకప్‌ టికెట్లు అమ్మనున్నారు. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం ఈ నెల 30 నుంచి విక్రయించున్నారు. సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు సెప్టెంబర్‌ 15 నుంచి అమ్మనున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links