Buddha
Home » వాస్తు దోషానికి ఈ బుద్ధ విగ్రహం పరిష్కారం!

వాస్తు దోషానికి ఈ బుద్ధ విగ్రహం పరిష్కారం!

by admin
0 comment

గౌతమ బుద్ధుడు జ్ఞానోదయానికి, అంతర్గత శాంతికి చిహ్నం. వాస్తుప్రకారం, అలాగే ఫెంగ్ షుయ్ ప్రకారం.. బుద్ధుని విగ్రహాలు ఇంట్లో శాంతి, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. అయితే బుద్ధుడు అనేక రూపాల్లో కనిపిస్తుంటారు. ఒక్కో రూపానికి ఓ ప్రత్యేకత ఉంటుందని, అవి కొన్ని దిక్కుల్లో ఉంచితే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వాటి గురించి తెలుసుకుందామా..!

నిద్రిస్తున్న బుద్ధుని విగ్రహం

శక్యముని బుద్ధుని యొక్క చివరి క్షణాలను గుర్తుచేస్తూ, కుడిచేయి తలకింద ఉంచిన రూపాన్ని నిద్రపోతున్న బుద్ధ విగ్రహంగా భావిస్తుంటారు. ఇది జ్ఞానోదయంతో వచ్చే పరోపకారాన్ని, పునర్జన్మ చక్రం నుంచి విముక్తిని చూపుతుందని చెబుతుంటారు. అయితే ఇంట్లో శాంతి కోసం నిద్రిస్తున్న బుద్ధుడు పడమర వైపు ఉండాలని సూచిస్తుంటారు.

భూమిస్పర్శ ముద్రలో ఉన్న బుద్ధ విగ్రహం

భూమిని తాకే భంగిమలో ఉన్న బుద్ధ ప్రతిమ జ్ఞానోదయానికి ప్రతీకగా పేర్కొంటారు. పద్మాసనంలో ఉన్న బుద్ధ ప్రతిమ అత్యంత ప్రసిద్ధ భంగిమలలో ఒకటి. ఈ రూపాన్ని గృహంలో తూర్పువైపు ఉంచినట్లయితే అదృష్టం కలిసివస్తుందని భావిస్తారు.

రక్షణ బుద్ధ విగ్రహం

ఆశీర్వదించినట్లు ఉండే బుద్ధ విగ్రహం రక్షణ కవచంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. వాస్తు దోష నివారణకు ఈ తరహా విగ్రహాన్ని నివాసంలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవాంఛిత శక్తులను దూరంగా ఉంచడానికి ప్రధాన ద్వారం ఎదురుగా రక్షిత బుద్ధుని విగ్రహం ఉంచాలని చెబుతుంటారు.

ధ్యాన బుద్ధ విగ్రహం
పద్మాసనంలో కూర్చొని ధ్యాన ముద్రలో ఉన్న విగ్రహం ప్రశాంతతకు, శాంతికి నిదర్శనం. వాస్తు ప్రకారం బుద్ధున్ని ధ్యానం చేయడం ప్రశాంత వాతావరణానికి సహాయపడుతుంది.ఈ ధ్యాన బుద్ధ విగ్రహాలను పూజా గదిలో, తోటలో ఉంచవచ్చు.

మెడిసిన్ బుద్ధ విగ్రహం

పూర్తి ఆరోగ్యాన్నికాంక్షించే వ్యక్తులు ఔషధ బుద్ధ విగ్రహాన్ని ఇష్టపడతారు. ఈ విగ్రహం ఎడమ చేతిలో మూలికల గిన్నెను, కుడి చేయితో బుద్ధుని ఆశీస్సును సూచిస్తుంది.

బుద్ధుని శిరస్సు- అలంకరణ

బుద్ధుని ముఖం అనేది ఇంట్లో అలంకరించేందుకు తరచుగా ఉపయోగించే ఒక సాధారణ కళాఖండం. బుద్ధుని శిరస్సు ఆధునిక సృజనాత్మక రూపం. ఇది అతని స్వీయ జ్ఞానానికి ప్రతీక. దీన్ని గది ప్రవేశ ద్వారం వద్ద అలంకరణగా ఉంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

లాఫింగ్ బుద్ద విగ్రహం

ఇక్కడ నవ్వుతూ ఉన్న వ్యక్తి బుద్ధుడు కాదు. అతను 10వ శతాబ్దానికి చెందిన బుడై అనే చైనీస్ సన్యాసి అని నమ్ముతారు. చాలా ఇళ్లలోనూ, కార్యాలయాల రిసెప్షన్ టేబుళ్ల వద్ద ఈ విగ్రహం ఉంచడం మనం గమనిస్తుంటాం. ఈ విగ్రహం మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుని సంతోషంగా ఉండాలని గుర్తు చేస్తుంది. ఇది ఫెంగ్ షూయ్ వాస్తుకు సంబంధించిన చిహ్నం అయినప్పటికీ, వాస్తు శాస్త్ర నిపుణులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ చిహ్నాన్ని ఇంట్లో తూర్పు భాగాన గాని, ఒక కార్నర్ టేబుల్‌పై గాని, మెయిన్ డోర్‌కు ఎదురుగా అయినా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links