AkshayKumar
Home » అంబానీ-అదానీని మించిన Akshay Kumar

అంబానీ-అదానీని మించిన Akshay Kumar

by admin
0 comment

భారతదేశంలో 2022-2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి సుమారు 6 కోట్ల ఐటీఆర్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఆదివారం వెల్లడించింది. ఆదివారం సాయంత్రం వరకు దాదాపు 27 లక్షల ఐటీఆర్‌ లు దాఖలయ్యాయని తెలిపింది. అంబానీ-అదానీ లేదా టాటా-బిర్లా భారతదేశపు అతిపెద్ద పన్ను చెల్లింపుదారుగా ఉంటారని మీరందరూ అనుకుంటున్నారు కదా. కానీ ఇది తప్పు. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్.

ఆదాయపు పన్ను శాఖ అందించిన డేటా ప్రకారం, అక్షయ్ కుమార్ గత సంవత్సరం అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. గతేడాది అక్షయ్‌ సుమారు 29.5 కోట్ల ఆదాయపు పన్ను జమ అయ్యింది. ఈ ఏడాది తన ఆదాయం రూ.486 కోట్లుగా ప్రకటించారు. అక్షయ్ కుమార్ బాలీవుడ్ లోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. అక్షయ్ కుమార్ ఏడాదికి దాదాపు 4-5 సినిమాలు చేస్తారు. ఇది కాకుండా, అక్షయ్ కుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ను నడుపుతున్నారు. 2022కి ముందు కూడా భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తి అక్షయ్ కుమార్. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, అతను 25.5 కోట్ల రూపాయల ఆదాయపు పన్నును డిపాజిట్ చేశారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links