movie
Home » movies:జులైలో బాక్సాఫీస్‌ సాగిందిలా..!

movies:జులైలో బాక్సాఫీస్‌ సాగిందిలా..!

by admin
0 comment

జులై నెల ముగిసింది. దాదాపు 23 సినిమాలు రిలీజయ్యాయి. ఎప్పట్లానే సక్సెస్ పర్సంటేజీ చాలా తక్కువ. భారీ అంచనాలతో వచ్చిన బ్రో సినిమా హిట్టవ్వగా.. చిన్న సినిమాగా వచ్చిన బ్రో మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయింది. జులై నెల బాక్సాఫీస్ రివ్యూ చూద్దాం..

జులై మొదటి వారంలో 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమా రంగబలి. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా ఫస్టాఫ్ సూపర్ హిట్టయింది. సెకెండాఫ్ మాత్రం ఎవ్వరికీ నచ్చలేదు. ఫలితంగా రంగబలి రిజల్ట్ తేడా కొట్టింది.

ఈ సినిమాతో పాటు మొదటివారంలో.. సర్కిల్ అనే సినిమా వచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నర్ నీలకంఠ డైరక్ట్ చేసిన సినిమా ఇది. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శరత్ చంద్ర నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదలైంది. కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఇదే వారంలో ఓ సాథియా, రుద్రంగి, గ్యాంగ్ లీడర్, 7.11PM సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో రుద్రంగి సినిమా ప్రచారంతో ఆకట్టుకుంది కానీ మెప్పించలేకపోయింది. ఓవరాల్ గా జులై ఫస్ట్ వీక్ లో క్లిక్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు.

ఇక జులై రెండో వారంలో కూడా 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన సినిమా బేబి. సాయిరాజేష్ దర్శకత్వంలో చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్టయింది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బేబి. ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమా సూపర్ హిట్టయింది. ప్రస్తుతం 85 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఈ సినిమా టాప్ చార్టుల్లో కొనసాగుతోంది.

ఈ సినిమాతో పాటు శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరుడు సినిమా రిలీజైంది. దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా తమిళ్ లో హిట్టయింది కానీ, తెలుగులో మాత్రం ఫ్లాప్ అయింది.

జులై సెకండ్ వీక్ లో వచ్చిన మరికొన్ని సినిమాలు నాయకుడు, భారతీయన్స్, రివెంజ్, బోగన్. ఈ సినిమాలేవీ థియేటర్లలో నిలబడలేకపోయాయి. మరీ ముఖ్యంగా నాయకుడు సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ లెక్క తప్పింది.

మూడో వారంలో 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడలేదు. వీటిలో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన హత్య సినిమాపై ఓ మోస్తరు అంచనాలుండేవి. కానీ హత్య సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది.

ఇదే వారంలో హిడింబ అనే సినిమా కూడా వచ్చింది. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో SVK సినిమాస్ బ్యానర్‌ పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. నందిత శ్వేత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అనీల్ సుంకర సమర్పించారు. గ్రాండ్ గా ప్రమోషన్ చేసినప్పటికీ, సినిమా నిలబడలేకపోయింది. దీంతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

జులై చివరి వారంలో బ్రో సినిమా వచ్చింది. పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. ఈ సినిమాకు ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లు వస్తున్నాయి. పవన్ శ్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక బ్రో సినిమాతో పాటు.. స్లమ్ డాగ్ హజ్బెండ్ అనే సినిమా వచ్చింది. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా నటించిన ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రెస్పాన్స్ రాలేదు.

ఇలా జులై నెలలో అటుఇటుగా 23 సినిమాలు రిలీజ్ అవ్వగా.. బేబి, బ్రో సినిమాలు మాత్రమే క్లిక్ అయ్యాయి. మిగతా సినిమాలన్నీ డిసప్పాయింట్ చేశాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links