rashmika
Home » ఇవి హీరోయిన్స్‌ సీక్రెట్స్‌.. అస్సలు ఊహించరు!

ఇవి హీరోయిన్స్‌ సీక్రెట్స్‌.. అస్సలు ఊహించరు!

by admin
0 comment

ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి. అలానే హీరోయిన్లకు కూడా కొన్ని సీక్రెట్స్, పైకి చెప్పని టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు వాటిని బయటపెడతారు. మరికొందరు బయటకు చెప్పరు. కానీ సమంత, రష్మిక, తమన్న, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మాత్రం తమ సీక్రెట్స్ ను, పైకి చెప్పని టాలెంట్స్ ను బయటపెట్టారు.

ఎవరైనా కుడి చేత్తో రాస్తారు, లేదంటే ఎడమ చేత్తో రాస్తారు. కానీ నిధి అగర్వాల్ మాత్రం 2 చేతులతో రాయగలదు. ప్రపంచంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఉండే టాలెంట్ ఇది. ఈమె డాన్స్ బాగా చేస్తుందని అందరికీ తెలుసు. కానీ 2 చేతులతో రాయగలదనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

తనకు సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టింది రాశిఖన్నా. అదేంటంటే.. ఆమెకు ఎడమ కన్నులో చిన్న లోపం ఉందంట. కానీ అది ఎవ్వరికీ కనిపించదు. మరీ ముఖ్యంగా మేకప్ వేసిన తర్వాత అస్సలు కనిపించదు. బహుశా, అదే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందేమో.

నేషనల్ క్రష్ రష్మిక కూడా తనకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. అందులో ఒకటి ఏంటంటే.. ఈమె ఓసారి కుక్క బిస్కెట్లు ట్రై చేసింది. దీంతో పాటు బయటపెట్టిన మరో సీక్రెట్ ఏంటంటే.. ఆమె రెగ్యులర్ గా వైన్ తాగుతుందట. తన గ్లామర్ సీక్రెట్స్ లో వైన్ కూడా ఒకటని చెబుతోంది.

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంతకు సంబంధించిన సీక్రెట్ కూడా ఒకటి ఉంది. ఈమెకు వంట చేయడం రాదు. ఇల్లు సర్దుకోవడం అంటే బద్ధకం. ఈ రెండు సీక్రెట్స్ ను ఓ సందర్భంలో స్వయంగా నాగచైతన్య బయటపెట్టాడు.అప్పట్లో వాళ్లిద్దరూ కలిసి ఉండేవారు. తర్వాత విడాకులు తీసుకున్నారు.

నభా నటేష్, తెరపై గ్లామరస్ గా కనిపిస్తుంది. బాగా నటిస్తుంది కూడా. కానీ ఆమెకు సంబంధించిన మరో టాలెంట్ మాత్రం చాలామందికి తెలియదు. అదేంటంటే.. నభా నటేష్ మంచి ఆర్టిస్ట్. పెయింటింగ్స్ బాగా గీస్తుంది. ఈమధ్య ఆమె గీసిన చార్లీ చాప్లిన్ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మిల్కీబ్యూటీ తమన్నకి కూడా ఓ టాలెంట్ ఉంది. ఈమె అందంగా కనిపించడమే కాదు, అంతే అందంగా కవితలు కూడా రాస్తుంటుంది. తన కవితలతో ఓ పుస్తకం ప్రచురించాలనేది తమన్న కోరిక. ఈ విషయాన్ని తమన్న బెస్ట్ ఫ్రెండ్ కాజల్ ఓ సందర్భంలో బయటపెట్టింది.

బోల్డ్ గా నటించడం రాధిక ఆప్టేకు ఇష్టం. అలా నటించడం మాత్రమే కాదు.. టైమ్ దొరికినప్పుడల్లా కొత్త కొత్త కథలు రాయడం కూడా ఈ బ్యూటీకి ఇష్టం. ఇప్పటికే కొన్ని కథలు రాసింది. ఇంకాస్త టైం దొరికితే వాటికి స్క్రీన్ ప్లే కూడా ట్రై చేస్తానంటోంది.

సీరత్ కపూర్… ఈ స్లిమ్ బ్యూటీకి ఓ వీక్ నెస్ ఉంది. ఇన్నాళ్లూ ఆ సీక్రెట్ ను ఆమె బయటపెట్టలేదు. రీసెంట్ గానే బయటపెట్టింది. అదేంటంటే.. సీరత్ కపూర్ కు అద్దం పిచ్చి. ఎన్ని గంటలైనా అలా అద్దం చూస్తూ ఉండిపోతుందట ఈ చిన్నది. సరిగ్గా ఇదే వీక్ నెస్ ప్రియాంక చోప్రాకు కూడా ఉంది. షాపులో చిన్న స్పూన్ కనిపించినా, అందులో తన ముఖం చూసుకుంటుందంట.

కత్రినాకైఫ్ కు కూడా ఓ సీక్రెట్ ఉంది. రోజంతా వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ స్టన్నింగ్ బ్యూటీ.. ఆదివారం వచ్చిందంటే అన్నింటికీ శెలవు ఇచ్చేస్తుందట. చివరికి స్నానం చేయడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదట కత్రిన.

తెలుగులో నేల టిక్కెట్, రెడ్ సినిమాల్లో నటించింది మాళవిక శర్మ. అందరికీ ఆమె హీరోయిన్ గా, మోడల్ గా మాత్రమే తెలుసు. కానీ మాళవిక శర్మ లాయర్ కూడా. ఆమె రీసెంట్ గా లా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ముంబయి బార్ కౌన్సిల్ లో సభ్యత్వం కూడా తీసుకుంది.

శృతిహాసన్.. ఈ ముద్దుగుమ్మకు చాలా టాలెంట్స్ ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. నటిస్తుంది, బాగా డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, సాంగ్స్ కంపోజ్ చేస్తుంది. అయితే వీటితో పాటు మరో హిడెన్ టాలెంట్ కూడా ఉంది. ఖాళీ సమయాల్లో ఆర్గానిక్ సబ్బులు తయారు చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. అలా తయారుచేసిన సబ్బుల్ని తను వాడడంతో పాటు, ఇష్టమైన వాళ్లకు బహుమతులుగా కూడా అందిస్తుంది.

నిత్యామీనన్ కు నటించడం, పాటలు పాడడంతో పాటు కథలు రాయడం ఇష్టం. ఎప్పటికైనా డైరక్టర్ అవ్వాలనేది ఈమె కోరిక. ఇప్పటికే 2-3 కథలు రాసుకుంది. వీటిలో ఒక కథకు టోటల్ స్క్రీన్ ప్లే కూడా రెడీగా ఉందని ప్రకటించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links