324
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం కూడా సెలవును ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రగతి భవన్లో సీఎం ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు.
కాగా, జలదిగ్బంధంలో చిక్కుకున్న జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలంలోని మోరంచపల్లి గ్రామం పరిస్థితుల గురించి సీఎం ఆరాతీశారు. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.