భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘విరాట్ కోహ్లి-జహీర్ ఖాన్’ మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన చెప్పాడు. తన కెరీర్‌ను కోహ్లి ముగించినట్లుగా జహీర్ అన్నాడని తెలిపాడు. దీంతో నెట్టింట్లో ఈ టాపిక్ వైరల్‌గా మారింది.
అయితే ఇది 2014లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో చోటు చేసుకుందని ఇషాంత్ అన్నాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ క్యాచ్‌ను వదిలివేయడంతో లైఫ్ లభించిన కివీస్ ప్లేయర్ మెక్‌కలమ్ ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాదేశాడు. టీమిండియా పేసర్లపై విరుచుకుడుతూ పరుగులు బాదేశాడు.
క్యాచ్ జారవిడిచిన అనంతరం కోహ్లి జహీర్‌కు సారీ చెప్పాడు. అంతేగాక నిరుత్సాహంతో ఆ టెస్టులో చాలాసార్లు క్షమాపణలు చెప్పాడు. దీంతో జహీర్.. ‘నా కెరీర్ ముగించావు’ అని కోహ్లితో సరదాగా అన్నాడని ఇషాంత్ వివరించాడు. కానీ ఈ మాటలు నెటిజన్లు వేరేలా అర్థం చేసుకోవడంతో నెట్టింట్లో చర్చ మొదలైంది.
దీంతో దీనిపై జహీర్ స్పందించాడు. ”కోహ్లితో నేను అలా అనలేదు. టెస్టు కెరీర్‌లో అప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే లైఫ్ లభించి ట్రిపుల్ సెంచరీ సాధించారని చెప్పా. గ్రాహం గూచ్ క్యాచ్‌ను కిరణ్ మోరె వదిలేయడంతో 300 స్కోరు సాధించాడు. ఆ తర్వాత మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ చేజార్చడంతో త్రిశతకం బాదాడు. అయితే, ఈ క్యాచ్‌ను వదిలేసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. సరిగ్గా మాట్లాడలేకపోయాడు” అని జహీర్ తెలిపాడు.
‘‘విరాట్‌తో నేను అలా అనలేదు. టెస్టు కెరీర్‌లో అప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే క్యాచ్ డ్రాప్‌తో బతికిపోయిన తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించారని చెప్పా. గ్రాహం గూచ్ క్యాచ్‌ను కిరణ్ మోరె వదిలేయడంతో 300 స్కోరు కొట్టాడు. ఆ తర్వాత మెక్‌కల్లమ్ ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ చేజార్చడంతో త్రిశతకం బాదాడు. అయితే, ఈ క్యాచ్‌ను వదిలేసిన తర్వాత విరాట్ కోహ్లీ చాలా నిరుత్సాహానికి గురయ్యాడు. సరిగ్గా మాట్లాడలేకపోయాడు’’ అని జహీర్ తెలిపాడు.