Narendra Modi
Home » మాటిస్తున్నా.. వాళ్లని వదిలిపెట్టం: మోదీ

మాటిస్తున్నా.. వాళ్లని వదిలిపెట్టం: మోదీ

by admin
0 comment

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన అమానుష ఘటన నా మనస్సుని తీవ్రంగా కలచివేసిందని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటన యావత్‌ భారతీయులను సిగ్గుపడేలా చేసిందని, బాధితులకు జరిగిన అన్యాయాన్ని క్షమించలేమని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని, నిందితులను ఎట్టిపరిస్థితుల్లో విడిచిపెట్టబోమని తెలిపారు. ఈ విషయంపై న్యాయం జరుగుతుందని భారత ప్రజలకు భరోసా ఇస్తున్నాని అన్నారు. ఈ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని కోరారు.

మణిపుర్‌లో కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై కొందరు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించి, వారిని నగ్నంగా ఊరేగించిన విషయం తెలిసిందే. మే 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మణిపూర్‌ ఘటనను సుమోటాగా గురువారం స్వీకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links