Home » Rangabali Movie Review – రంగబలి రివ్యూ

Rangabali Movie Review – రంగబలి రివ్యూ

by admin
0 comment

నటీనటులు: నాగశౌర్య, యుక్తి తరేజా, గోపరాజు రమణ, సత్య, షైన్ టామ్ చాకో తదితరులు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కెమెరా: వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి
మ్యూజిక్: పవన్ సీహెచ్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
దర్శకత్వం: పవన్ బాసంశెట్టి
విడుదల తేదీ: జులై 7, 2023
రన్ టైమ్: 2 గంటల 20 నిమిషాలు
రేటింగ్: 2.5/5

కథ
శౌర్య అలియాస్ షో (శౌర్య) తన సొంతూరు రాజవరంలో కింగ్ లా బతకాలని ఆశ పడతాడు. మరోవైపు శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాప్ ను నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. కానీ, కొడుకు భవిష్యత్తు పై ఆందోళనతో ఉంటాడు. ఈ క్రమంలో శౌర్యను వైజాగ్‌ లో మెడికల్ కాలేజ్‌ కి పంపిస్తాడు. అక్కడి సహజ (యుక్తి తరేజా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శౌర్య ప్రేమకు అతని ఊరిలోని రంగబలి సెంటర్ అడ్డంకిగా మారుతుంది? ఇంతకీ ఆ సెంటర్‌కు రంగబలి అని పేరు ఎందుకు వచ్చింది.. అలాగే రంగబలి సెంటర్‌కు ఆ ఊరి ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)కు ఉన్న రిలేషన్ ఏంటి.. చివరికి రంగబలి సెంటర్ కు హీరో ఆ పేరు మార్చగలిగాడా లేదా అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు
నాగశౌర్య చాలా ఈజ్ తో చేశాడు. మొన్నటివరకు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా కనిపించిన ఈ నటుడు.. ఈ సినిమాతో తనలోని మాస్ కోణాన్ని కూడా చూపించాడు. సిక్స్ ప్యాక్ తో అలరించాడు. అతడి కామెడీ టైమింగ్, యాక్షన్ బాగున్నాయి. హీరోయిన్ యుక్తి తరేజా బాగా చేసింది. సన్నివేశాల్లో స్మూత్ గా, సాంగ్స్ లో హాట్ గా కనిపించి మెప్పించింది. కమెడియన్ సత్య ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. ఫస్టాఫ్ మొత్తాన్ని తన భుజాలపై మోశాడు ఈ హాస్యనటుడు. ఇతడి కోసమైనా రంగబలి సినిమాను ఓసారి చూడాల్సిందే. విలన్ గా షైన్ టామ్ చాకో, హీరోయిన్ తండ్రిగా మురళీశర్మ, హీరో సైడ్ కిక్ గా రాజ్ కుమార్, విలన్ సైడ్ కిక్ గా గేయరచయిత అనంతశ్రీరామ్, హీరో తండ్రిగా గోపరాజు రమణ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నీషియన్స్ పనితీరు
టెక్నికల్ గా సినిమా యావరేజ్ గా ఉంది. పవన్ సీహెచ్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉంది. సినిమాలో ఒక్క పాట కూడా క్లిక్ అవ్వలేదు. ఐటెంసాంగ్ అయితే మరీ ఘోరం. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయానికొస్తే ఉన్నంతలో బెటర్. వంశీ పచ్చిపులుసు, దివాకర్ మణి కెమెరా వర్క్ బాగుంది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే. రంగబలి సెంటర్ సెట్ ను బాగా వేశారు. ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు.

న్యూస్ 360 ఎక్స్ క్లూజివ్ రివ్యూ…
సినిమాలో ప్రధానంగా ఎమోషన్ మిస్సయింది. కామెడీపై ఎక్కువగా దృష్టిపెట్టిన దర్శకుడు, సెకెండాఫ్ లో యాక్షన్, ఎమోషన్ ను మిక్స్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఫస్టాఫ్ మొత్తం హీరో-హీరోయిన్ లవ్ ట్రాక్, సత్య కామెడీ, రాజ్ కుమార్ పంచ్ లతో సరదాగా సాగిపోతుంది. ఇంటర్వెల్ కు వచ్చేసరికి భయంకరమైన ట్విస్ట్ ఇస్తాడు దర్శకుడు.

అంత ట్విస్ట్ ఇచ్చిన తర్వాత, రెండో భాగంలో భారీ యాక్షన్, ఎమోషన్ ఆశిస్తారు ఎవరైనా. కానీ దర్శకుడు మాత్రం హడావుడిగా సినిమాను ముగించడానికే ప్రయత్నించాడు. చూపించిన సన్నివేశాల్ని కూడా ఎఫెక్టివ్ గా చూపించలేకపోయాడు. మరోవైపు కథను ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంతో, తన బలమైన కామెడీని కూడా వదిలేయడం రంగబలి రెండో భాగాన్ని దారుణంగా దెబ్బతీసింది.

ఉన్నంతలో నాగశౌర్య యాక్టింగ్, సత్య కామెడీ, కాలేజీ ఎపిసోడ్, బాంబ్ ఎపిసోడ్ కోసం ఈ సినిమాను ఓ సారి ట్రై చేయొచ్చు. మరీ భారీ వినోదాన్ని ఆశించొద్దు కానీ, ఓ మోస్తరుగా టైమ్ పాస్ అయ్యే సినిమానే ఇది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links