పాఠశాల పైకప్పు కూలి 10 మంది మృతి

చైనాలోని ఓ పాఠశాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల జిమ్‌ పైకప్పు కూలడంతో 10 మంది మరణించారు. మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నారు. ఈశాన్య చైనాలోని హెలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని క్విక్విహార్‌లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో దాదాపు 19 మంది జిమ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో నలుగురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

అయితే ప్రమాదానికి కారణం పెర్‌లైట్‌ పధార్థంగా భావిస్తున్నారు. నిర్మాణానికి వినియోగించిన దీన్ని పనుల అనంతరం పైకప్పు మీదే ఉంచారు. వర్షం పడిన సమయంలో అది నీరు మొత్తాన్ని పీల్చుకొని మరింత బరువు పెరిగిపోయింది. దీంతో పైకప్పు కూలిపోయినట్లు భావిస్తున్నారు. కాగా, ఇటీవల చైనాలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో ఓ రెస్టారంట్‌లో పేలుడు సంభవించి 31 మంది, బొగ్గుగనిలో ప్రమాదం సంభవించి 53 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..