Home » టెస్లా CFO – వైభవ్ తనేజా

టెస్లా CFO – వైభవ్ తనేజా

by admin
0 comment

భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, టెస్లా కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు, మునుపటి ఫైనాన్స్ చీఫ్ జాచరీ కిర్కోర్న్ తన పదవీ విరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో టెస్లా వైభవ్ ను కొత్త సీఎఫ్ఓగా నియమిస్తూ ప్రకటన ఇచ్చింది.

45 ఏళ్ల తనేజా, టెస్లా లో మాస్టర్ ఆఫ్ కాయిన్, ఫైనాన్స్ చీఫ్‌గా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. మొన్నటివరకు ఆయన కంపెనీలో చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్ (CAO). ఇప్పుడు కిర్కోర్న్ పదవీ విరమణతో ఏకంగా CFO అయ్యారు.

ఎలాన్ మస్క్ నేతృత్వంలోని అమెరికన్ దిగ్గజ కంపెనీ టెస్లాలో 13 ఏళ్లు పనిచేశారు కిర్కోర్న్. కంపెనీ అభివృద్ధిలో ప్రతి దశలో ఈయన ఉన్నారు. ఇప్పుడు ఆయన పదవీ విరమణతో కీలక పొజిషన్ ఖాళీ అయింది. కంపెనీలో అడుగుపెట్టిన నాలుగేళ్లకే, వైభవ్, ఆ కీలక స్థానాన్ని భర్తీ చేశారు.

తనేజా మార్చి 2019 నుండి టెస్లా CAOగా.. మే 2018 నుండి కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నారు. అతను ఫిబ్రవరి 2017, మే 2018 మధ్య అసిస్టెంట్ కార్పొరేట్ కంట్రోలర్‌గా పనిచేశాడు. మార్చి 2016 నుండి సోలార్‌సిటీ కార్పొరేషన్‌లో వివిధ ఫైనాన్స్-అకౌంటింగ్ రోల్స్ పోషించారు. 2016లో టెస్లా కొనుగోలు చేసిన యూఎస్- ఆధారిత సోలార్ ప్యానెల్ డెవలపర్ ప్రాజెక్టులో వైభవ్ తనేజా కీలక సభ్యుడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links