Remi Lucidi: 68వ అంతస్తు నుంచి పడి…

ప్రమాదకరమైన సాహసాలు చేయడం అతడికి సరదా.. అత్యంత ఎత్తైన భవనాలు అధిరోహించడంలో అతడు నేర్పరి. కానీ అదే సాహసం అతడి ప్రాణాలను తీసింది. నెటిజన్లకు సుపరిచితుడైన రెమీ లుసిడి (Remi Lucidi) ప్రమాదవశాత్తు మరణించారు. 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ సాహసికుడు 68వ అంతస్తు నుంచి జారిపడి అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన హంకాంగ్‌లో చోటు చేసుకొంది.

హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి లుసిడి మరణించాడు. కింద పడిపోవడానికి ముందు ఈ భవనం 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్‌ కిటికి బయట చిక్కుకుపోయాడు. దీంతో భయంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. అతడిని కిటికి బయట చూసిన ఆ పెంట్‌హౌస్‌లోని పనిమనిషి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పింది. దీంతో నేరుగా కిందపడిపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతడు అనుమతి లేకుండా ఆ భవనం పైకి ఎక్కడానికి ప్రయత్నించాడని స్థానిక పోలీసులు చెప్పారు.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..