Muharram: నిప్పులపై నడుస్తూ జారిపడ్డారు

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహరం పండుగ దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పీర్ల ను ఊరేగించారు, నిప్పుల్లో నడిచారు. అయితే కొన్ని చోట్ల అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో, నిప్పులపై నడిచే క్రమంలో పలు ప్రమాదాలు జరిగాయి.

అనంతపురం జిల్లాలో నిప్పులపై ఓ వ్యక్తి నడుస్తూ కాలు జారి కిందపడిపోయారు. దీంతో అతడికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న భక్తులు వెంటనే అతడికి సహాయం చేయడంతో గాయాల తీవ్రత కాస్త తగ్గింది. అంతేగాక కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా బొమ్మనహళ్లి గ్రామంలో కూడా రమేష్‌ అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. రమేష్‌ చిన్నారిని ఎత్తుకొని నిప్పులపై నడుస్తూ అదుపుతప్పి కిందపడిపోయారు. దీంతో చిన్నారితో పాటు అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సైలెన్స్‌ ప్లీజ్‌-ముగిసిన ఎన్నికల ప్రచారం