viral: ట్రాఫిక్ బూత్‌లో ‘మందుబాబుల సిట్టింగ్‌’

ట్రాఫిక్‌ జంక్షన్‌లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ట్రాఫిక్‌ బూత్‌లో పోలీసులు ఉంటూ రవాణా రద్దీని క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్‌ను కంట్రోల్ చేయడం చేస్తుంటారు. కానీ ఆకతాయిలు దీన్ని ఏకంగా మందు కొట్టడానికి అడ్డాగా మార్చుకున్నారు.

అయితే ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. అవి కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానంగా ఉన్నా కూడా.. పోలీసులు ఎవరూ దీన్ని గుర్తించలేకపోవడం గమనార్హం. కాగా, ఆకతాయిల చర్యను గమనించిన ప్రయాణికులు వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో వీడియో ట్రెండింగ్‌లో ఉంది.

Related posts

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 3: కోట్లు ‘హరి’మనిపించినవాడు ఎలా తప్పించుకుంటున్నాడు..? సమాచారం ఇచ్చేదెవరు..?

సింగరేణి బ్లప్‌ మాస్టర్‌ 2: గ్రూప్‌ – 1 ఆపీసర్‌ నంటూ కోట్లు దండుకున్న బ్లప్‌ మాస్టర్‌.. అందుకు సహకరించిన సెక్రెటరీయేట్‌ సెక్యూరిటీ సిబ్బంది..?

సింగరేణి ‘బ్లప్‌ మాస్టర్‌’.. 70 కోట్లు కొట్టేశాడు..?ఏడాదిగా పోలీస్‌లకు చిక్కని వైట్‌ కాలర్‌ నేరస్తుడు..